: ఒక భాష, రెండు రాష్ట్రాలు... తప్పులేదు: జైరాం రమేష్

భాష ఒకటైనా రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేయడంలో తప్పులేదని కేంద్ర మంత్రి జైరాం రమేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఇవాళ సికింద్రాబాదులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర విభజన విషయంలో బీజేపీ రెండు నాల్కల ధోరణి అవలంబించిందని ఆరోపించారు. హైదరాబాదు నగరం దేశానికే షాన్ అని కొనియాడారు. హైదరాబాదు నుంచి వెళ్లమనే అధికారం ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ఒక చారిత్రాత్మక నిర్ణయంలో రెండు రాష్ట్రాలు ఏర్పాడ్డాయని ఆయన అన్నారు.

More Telugu News