: కేసీఆర్ 3 నెలలు మేల్కొంటే, 9 నెలలు నిద్రపోతారు: గుత్తా
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మూడు నెలలు మేల్కొంటే, తొమ్మిది నెలలు నిద్రపోతారని కాంగ్రెస్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. నల్గొండలో ఇవాళ గుత్తా మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ లాంటి వ్యక్తులతో తెలంగాణ అభివృద్ధి చెందదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తన కుటుంబానికి ఆరు సీట్లు ఇచ్చుకున్నారని ఆయన ఆరోపించారు.
తెలంగాణ కోసం మరణించిన అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఓడిపోయే చోట సీటు ఇచ్చారని కేసీఆర్ పై గుత్తా మండిపడ్డారు. తెలంగాణ కోసం పోరాడిన తమపై టీఆర్ఎస్ ద్రోహులను నిలబెట్టిందని మరో నేత రాజయ్య విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో టీఆర్ఎస్ ను విలీనం చేస్తానని కేసీఆర్ ఇచ్చిన మాట తప్పారని, మాటపై నిలబడే మనిషి కాదని వివేక్ అన్నారు.