: ప్రతిపక్షాలు కుల, మత రాజకీయాలు చేస్తున్నాయి: సోనియా

విపక్షాలు కులం, మతం ఆధారంగా రాజకీయాలు చేయాలని చూస్తున్నాయని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ లోని మోరాదాబాదులో ఇవాళ సోనియా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆమె ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి లౌకిక విలువలకు కట్టుబడి ఉందని ఆమె వ్యాఖ్యానించారు. అన్ని కులాలు, మతాలను కలుపుకునిపోయే తత్వం తమదని సోనియా అన్నారు.

మరోవైపు మహారాష్ట్రలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ పర్యటించారు. నరేంద్ర మోడీతో పాటు ఆయనకు మద్దతు ఇస్తున్న పారిశ్రామికవేత్తలను ఆయన విమర్శించారు. మొదట బీజేపీ ఎలా ఉండేదో తెలుసా? అని ఆయన ప్రశ్నించారు. అప్పట్లో వాజ్ పేయి, అద్వానీ భాగస్వామ్యం ఉండేదని, ఇప్పుడు మోడీ, పారిశ్రామికవేత్త అదానీ భాగస్వామ్యం మొదలైందని రాహుల్ ఆరోపించారు. ఐదో దశ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తూ యూపీఏను మూడోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు.

More Telugu News