: తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
సికింద్రాబాదు తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇవాళ వేకువజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామిని దర్శించుకుంటున్నారు. భారీగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.