: ఒకే వేదికపై మోడీ, చంద్రబాబు, పవన్
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముగ్గురు అత్యంత జనాదరణ కలిగిన వ్యక్తులు. వీరు సభలు పెడితే సభా ప్రాంగణం కిక్కిరిసి పోతుంది. అలాంటి వీరు ముగ్గురూ ఒకే వేదిక పంచుకుంటే... ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇదే జరగబోతోంది. రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు చేతులు కలిపిన వీరు... తెలంగాణలో ఒకే సభా వేదికపైకి రానున్నారు. ఈ నెల 24న తెలంగాణలో మూడు బహిరంగసభలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లలో జరిగే ఈ సభలకు మోడీ, చంద్రబాబు, పవన్ లు హాజరవుతారు.