: ట్విట్టర్ కి ఖాతాదారులు ఎక్కువ... వాడేది మాత్రం తక్కువే!

సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లలో ట్విట్టర్ ది ప్రముఖ స్థానం. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 97.4 కోట్ల మంది ఖాతాదారులున్నారు. అయితే పేరుకు ఇంతమంది ఖాతాదారులున్నా... ట్విట్టర్ ను తరచూ వినియోగించే వారి శాతం చాలా తక్కువ. 44 శాతం మంది ట్విట్టర్లు ఖాతా అయితే తెరిచారు కానీ, ఒక్కసారి కూడా ట్వీట్ చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే 43.19 కోట్ల మంది అకౌంట్లు నిరుపయోగంగా ఉన్నాయి. ట్విట్టర్ అకౌంట్ యాక్టివిటీని పర్యవేక్షించే టుప్ చార్ట్స్ఈ విషయాల్ని వెల్లడించింది.

టుప్ చార్ట్స్ నివేదిక ప్రకారం 54.21 కోట్ల మంది మాత్రమే అసలు సిసలైన ట్విట్టర్లు. వీరు ఖాతా తెరిచిన తర్వాత కనీసం ఒక్కసారైనా ట్వీట్ చేశారు. అయితే 30 శాతం మంది ఒకటి నుంచి పది ట్వీట్లు మాత్రమే చేశారు. 13 శాతం మంది మాత్రమే వంద సార్లు ట్వీట్ చేశారు. ప్రతి నెల యాక్టివ్ ఖాతాదారులుగా ఉండేవారి సంఖ్య 24 కోట్ల వరకు ఉందని ట్విట్టర్ పేర్కొంది. వీరు నెలలో కనీసం ఒక్కసారైనా ట్వీట్ చేస్తారని వెల్లడించింది.

More Telugu News