: 19 మంది దోపిడీ దొంగలు పోలీసులకు దొరికిపోయారు!
19 మంది దోపిడీ దొంగలు సైబరాబాద్ పోలీసుల చేతికి చిక్కారు. వారి వద్ద నుంచి మొత్తం రూ. 75 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. రెండు కిలోల బంగారం, నాలుగు కిలోల వెండి, రివాల్వర్, కారుతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు.