: ఆకాశంలో విమానం డోర్ తెరిచేందుకు యత్నించిన ప్రయాణికుడు

అమెరికాలో ఓ ప్రయాణికుడు విమానంలో సహచర ప్రయాణికులకు ముచ్చెమటలు పట్టించాడు. విమానం డోర్ తెరవబోగా కొందరు అతడిని బలవంతంగా అదుపుచేసి నియంత్రించారు. షికాగో నుంచి కాలిఫోర్నియాకు వెళుతున్న విమానంలో ఇది చోటు చేసుకుంది. ప్రయాణికుడి చర్యతో విమానాన్ని ఒమాహాకు మళ్లించి విమానాశ్రయంలో దించేశారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్న తర్వాత విమానం తిరిగి గమ్యస్థానానికి బయల్దేరి వెళ్లింది.

More Telugu News