: మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను అమలుచేస్తాం: విజయమ్మ

తాము అధికారంలోకి వస్తే ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో)లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. విజయవాడలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోనేరు రాజేంద్రప్రసాద్ బెజవాడ అభివృద్ధికి కృషి చేస్తారని ఆమె చెప్పారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా వైఎస్ పనిచేశారని, మున్ముందు అదే తరహాలో ప్రజలకు సేవలందిస్తారని ఆమె భరోసా ఇచ్చారు. ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా విజయవాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి విజయమ్మ నివాళులర్పించారు.

More Telugu News