: కన్నుల పండువగా శ్రీవారి వసంతోత్సవాలు
తిరుమల శ్రీనివాసుడికి వసంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడవ రోజైన ఈ ఉదయం మలయప్పస్వామితోపాటు, శ్రీసీతారామలక్ష్మణ, ఆంజనేయస్వామి, రుక్మిణీ సమేత శ్రీకృష్ణుడి ఉత్సవమూర్తులను తిరువీధుల్లో ఊరేగిస్తూ వసంత మండపానికి చేర్చారు. సాయంత్రం వరకు అక్కడ వసంతోత్సవ సేవలు జరుగుతాయి. అనంతరం ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి చేర్చుతారు. ఆర్జిత సేవలు రేపటి నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి.