: రచయిత గుల్జార్ కు దాదాసాహెబ్ ఫాల్కే
ప్రముఖ హిందీ పాటల రచయిత, దర్శకుడు గుల్జార్ 2013 దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది. పలు బాలీవుడ్ హిందీ చిత్రాలకు గుల్జార్ పాటలు రాశారు. ఆయన కలం నుంచి జాలువారిన పలు పాటలకుగానూ జాతీయ అవార్డులు, కేంద్ర ప్రభుత్వ అవార్డులు అందుకున్నారు. 'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రంలో గుల్జార్ రాసిన 'జైహో...' అనే పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు పొందారు. పాటలు రాస్తున్న సమయంలోనే పలు సినిమాలకు మాటలు, స్క్రీన్ ప్లేలు కూడా రాసిన గుల్జార్ దర్శకుడిగా పలు హిందీ చిత్రాలు కూడా రూపొందించారు.