: ఆ హార్మోన్ తక్కువగా ఉంటే ఆనందం ఎక్కువగా ఉంటుందట
టెస్టో స్టెరాన్ శృంగార వాంఛలను నిర్ణయించే హార్మోన్. ఇది ఎక్కువగా ఉంటే శృంగారకాంక్ష ఎక్కువగా ఉంటుందన్నది సహజం. అయితే, ఈ హార్మోన్ ఎక్కువగా ఉంటే శృంగార వాంఛలతో రగిలిపోవచ్చేమో గానీ, దంపతులు ఎక్కువ కాలం ఆనందంగా ఉండలేరట. యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ శాస్త్రవేత్తలు ఈ వివరాలను వెల్లడించారు. స్త్రీ, పురుషుల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువగా ఉంటే వారికి మంచిదని, వారి మధ్య మరింత సంతృప్తి, బంధం పట్ల వారు అంకితభావంతో ఉంటారని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన సైకాలజీ ప్రొఫెసర్ రాబిన్ ఎడెల్ స్టీన్ తెలిపారు. ఈ హర్మోన్ ఎక్కువగా ఉండడం కొన్ని రకాల దీర్ఘకాలిక అనుబంధాలకు మంచిది కాదని చెప్పారు.