: మోడీ, సోనియాలకు అంత సీన్ లేదు: కవిత
తెలంగాణ ప్రాంతంలో నరేంద్ర మోడీ, సోనియాగాంధీల ప్రభావం ఏ మాత్రం ఉండదని నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత అన్నారు. టీఆర్ఎస్ ను ఓడించేంత సీన్ వీరికి లేదని చెప్పారు. తెలంగాణలో మెజారిటీ అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని తెలిపారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ ను తమ ఇంటి పార్టీగా భావిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు రెండూ దొందు దొందేనని చెప్పారు. ఈ రెండు పార్టీలు తెలంగాణ అభివృద్ధి కోసం ఏనాడూ చిత్తశుద్ధితో పనిచేయలేదని విమర్శించారు.