: ఆయన ఓకే అంటే... విజయం ఖాయం!

బుల్లి రాష్ట్రమైన మిజోరాంలో ఉన్న ఒక్క ఎంపీ సీటు కోసం ఎన్నిక జరిగింది. ఈ పోటీలో అన్ని రాజకీయ పార్టీలు ఒక్క వ్యక్తి చుట్టే తిరుగుతున్నాయి. ఆయన పేరు జియోన్గాకా చానా. ఈయనకు 39 మంది భార్యలు, 127 మంది పిల్లలు, మనవళ్లు ఉన్నారు. వీరిందరితో కలసి వంద గదుల సువిశాలమైన ఇంట్లో చానా నివసిస్తుంటారు. వీరిలో భార్యలందరూ ఓటర్లే. కొడుకుల్లోనూ దాదాపు 80 మంది ఓటర్లున్నారు. అంటే చానా చేతిలో సుమారు 160 వరకు ఓట్లున్నాయి.

విశేషం ఏమిటంటే, కుటుంబ సభ్యులందరూ చానా మాటను జవదాటరు. ఆయన ఏ పార్టీకి వేయమంటే ఆ పార్టీకే ఓటు వేస్తారు. అంటే గంపగుత్తగా 160 ఓట్లు ఒకే పార్టీకి పడతాయన్నమాట. మిజోరాం జనాభా చాలా తక్కువ. కొన్ని లక్షలే ఉంటుంది. కాబట్టి వంద ఓట్లు గెలుపోటములను నిర్ధారిస్తాయి. అందుకే పార్టీలన్నీ చానా గారి చుట్టూ చక్కర్లు కొడతాయి. చానా సరే అంటే అక్కడ గెలుపు తథ్యమన్నమాట!

More Telugu News