: క్యూలో నిలబడి ఓటు వేసిన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు ఆదర్శంగా నిలిచారు. మావల పంచాయతీ పిట్టలవాడ ఎస్టీ హాస్టల్ లో కుటుంబంతో కలిసి సాధారణ ఓటర్ల మాదిరిగా క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం అహ్మద్ బాబు మీడియాతో మాట్లాడుతూ... ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు చాలా ప్రాధాన్యత ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన చెప్పారు.

More Telugu News