: ఆ సిగ్నల్స్ కూలిన విమానం నుంచి వస్తున్నవేనా?

239 మందితో వెళుతూ నెల రోజుల క్రితం అదృశ్యమైన మలేసియన్ విమానం కోసం అన్వేషిస్తున్న వారు గత వారం రోజులుగా హిందూ మహాసముద్రంలో ఒక చోట సాగరగర్భంలోంచి సంకేతాలు వస్తున్నట్లు గుర్తించారు. అవి కూలిపోయిన విమానం బ్లాక్ బాక్స్ లోంచి వస్తున్నవేనని భావిస్తున్నారు. దీంతో అక్కడ అన్వేషణను ముమ్మరం చేశారు. ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ కూడా ఇదేవిధమైన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన చైనాలోని షాంఘైలో మీడియాతో మాట్లాడారు. ఆ సంకేతాల ఆచూకీ కోసం అన్వేషణ జరుగుతోందని తెలిపారు. బ్లాక్ బాక్స్ లభిస్తే విమానం కూలిపోవడానికి ముందు ఏం జరిగిందనే దానికి ఆధారాలు లభిస్తాయి. అందులోనూ బ్లాక్ బాక్స్ బ్యాటరీల్లో శక్తి పూర్తిగా అయిపోయే సమయం వచ్చేయడంతో ఆలోపే విమానం ఆచూకీ కనుగొనాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

More Telugu News