: బావ బరిలోకి దిగమన్నారు: బాలకృష్ణ

సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఇవాళ కరీంనగర్ జిల్లా ధర్మపురిలో చారిత్రాత్మకమైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి విచ్చేశారు. తన తాజా చిత్రం ‘లెజెండ్’ విజయవంతమైన సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి ఆయన రాష్ట్రంలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాలను సందర్శిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా బాలయ్య ఇవాళ ధర్మపురికి వచ్చారు.

ఆలయ అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో బాలకృష్ణకు స్వాగతం పలికారు. స్వామిని దర్శించుకున్న అనంతరం బాలయ్య మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ అధిష్ఠానం తనను ఆదేశించిందని, అయితే ఎక్కడి నుంచి పోటీచేయాలన్న దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన అన్నారు. తమ అభిమాన హీరో బాలయ్యని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.

More Telugu News