: రేపటి పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం: రమాకాంత్ రెడ్డి
హైదరాబాదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ... రేపు నిర్వహించే తుది విడత పరిషత్ పోలింగ్ కు సర్వం సిద్ధమని తెలిపారు. 536 జెడ్పీటీసీ, 7,975 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.
ప్రజలు ఓటుహక్కు వినియోగించుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా 25,758 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 5,075 కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్స్ ను నియమించినట్టు ఆయన తెలిపారు. ఎన్నికలు నిర్వహించే ప్రదేశాల్లో 6,057 సమస్యాత్మక ప్రాంతాలుగా, 6,463 అతి సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినట్లు రమాకాంత్ రెడ్డి వెల్లడించారు.