: కేసముద్రంలో రూ.4 లక్షలతో పట్టుబడ్డ నేత
జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్లను పంచేందుకు రూ.4 లక్షలను అక్రమంగా తరలిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతను వరంగల్ జిల్లాలో అరెస్ట్ చేశారు. ఎన్నికల తనిఖీలో భాగంగా కేసముద్రం స్టేషన్ పరిధిలోని సబ్ స్టేషన్ తండా వద్ద విధులు నిర్వహిస్తున్న ఎస్సై రంజిత్ కుమార్ కు కాంగ్రెస్ నేత దస్రూ నాయక్ నగదుతో దొరికిపోయాడు.
నాయక్ కారులో సోదా చేయగా రూ.4 లక్షలు దొరికాయి. పట్టుబడిన నగదుకు సరైన వివరాలు వెల్లడించకపోవడంతో అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఆ నగదును ఆదాయ పన్ను అధికారులకు అప్పగిస్తామని పోలీసులు చెప్పారు.
నాయక్ కారులో సోదా చేయగా రూ.4 లక్షలు దొరికాయి. పట్టుబడిన నగదుకు సరైన వివరాలు వెల్లడించకపోవడంతో అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఆ నగదును ఆదాయ పన్ను అధికారులకు అప్పగిస్తామని పోలీసులు చెప్పారు.