: 2014 పీఫా వరల్డ్ కప్ కు పిట్ బుల్ ప్రత్యేక గీతం

2014లో బ్రెజిల్ లో జరుగబోయే పీఫా ప్రపంచకప్ ఫుట్ బాల్ కోసం అమెరికన్ పాప్ సింగర్ పిట్ బుల్ ప్రత్యేక గీతం విడుదల చేశారు. వీఆర్ వన్ (ఓలె ఓలా) అంటూ సాగే ఈ గీతంలో అతనితో పాటు నటి, గాయని జెన్నిఫర్ లోపెజ్ కూడా గొంతు కలిపారు. ఈ గీతం, ప్రపంచకప్ అధికారిక గీతమైన డార్ ఉమ్ జీతో రెండూ వేర్వేరని, ఈ రెండింటిని ప్రపంచ కప్ ప్రచారం నిమిత్తం ఉపయోగిస్తామని ప్రపంచకప్ నిర్వాహకులు తెలిపారు. ప్రపంచకప్ ఫుట్ బాల్ ఆల్బమ్ లో రీకీ మార్టిన్, షకీరా, బహమెన్ లు రూపొందించిన గీతాలు ఉంటాయని ప్రపంచకప్ నిర్వాహకులు స్పష్టం చేశారు.

More Telugu News