: టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులుగా పలువురు నామినేషన్

తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు ఉదయం భిక్షపతి- పరకాల, సామ్యలు - తుంగతుర్తి, సత్యనారాయణ - ఎల్బీనగర్ నియోజకవర్గాల్లో రెబల్ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. ఇప్పటివరకు 119 నియోజకవర్గాలకు టీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే వాటిలో 109 స్థానాలకు బహిరంగంగా అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ మిగిలిన 10 స్థానాలకు రహస్యంగా అభ్యర్థులను పిలిచి బీఫారాలు అందజేసింది. దీంతో ఆయా స్థానాల్లో టికెట్ ఆశించిన పలువురు నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో దిగారు.

More Telugu News