: బిగ్ బీ 'జల్సా'లోకి దర్జాగా దూరిన అతిథి!

సెలబ్రిటీల ఇళ్లలోకి వెళ్లాలంటే అనుమతి తప్పనిసరి. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ ఇల్లు 'జల్సా'లోకి వెళ్లాలంటే సరైన కారణం, అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అలాంటి వాటితో పని లేకుండా, ఎవరింట్లోకైనా సరే దర్జాగా దూరేసే ఆ అతిథి తాజాగా బిగ్ బి నివాసం 'జల్సా'లో కులాసాగా దూరేసింది. ముంబైలోని అమితాబ్ బచ్చన్ నివాసంలోకి ఓ పాము ప్రవేశించింది. కాంక్రీట్ జంగిల్ గా పేరున్న ముంబైలో అత్యంత రద్దీ ప్రాంతంలో అమితాబ్ నివాసం ఉంది.

అక్కడ పాములు చేరే అవకాశం లేదు. అలాంటి చోట అకస్మాత్తుగా పాము కనిపించడంతో అమితాబ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. పాముల్ని పట్టే వారికి సమాచారం అందించారు. దాంతో వారు దానిని పట్టుకుని అడవిలో ఒదిలేశారని అమితాబ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. పాము ప్రవేశించే సమయానికి బిగ్ బి ఢిల్లీలో భూత్ నాథ్ ప్రమోషన్ కార్యక్రమంలో ఉన్నారు.

More Telugu News