: అమెరికా అధ్యక్ష పీఠంపై హిల్లరీ కన్ను

2016లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరంలోకి తాను అడుగుపెడుతున్నట్లు మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ సంకేతమిచ్చారు. అధ్యక్ష ఎన్నికలకు పోటీ పడే విషయమై ఆలోచిస్తున్నట్లు హిల్లరీ శాన్ ఫ్రాన్సిస్కోలో తెలిపారు. 'అధ్యక్షురాలు కావాలనుకుంటున్నారా? గెలవగలరా? అన్నవి కఠినమైన ప్రశ్నలు కావు. అసలైన కఠిన ప్రశ్నలు ఏమంటే... ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? ఏం మార్పు తీసుకురావాలనుకుంటున్నారు?' అంటూ హిల్లరీ తన లక్ష్యాన్ని చెప్పకనే చెప్పారు. తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ పోటీలో ఉండబోతున్నారంటూ ఇప్పటికే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఆమె ఇంత వరకూ దీనిపై మాట్లాడలేదు. ఆమె తాజా వ్యాఖ్యలు చూస్తుంటే అధ్యక్ష పీఠంపై కన్నేసినట్లే తెలుస్తోంది.

More Telugu News