: కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్న కిషన్ రెడ్డి
భారతీయ జనతాపార్టీ అంబర్ పేట అభ్యర్థిగా ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంబర్ పేట నుంచి కిషన్ రెడ్డి మూడోసారి ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. కార్యకర్తలతో కలిసి కిషన్ రెడ్డి ర్యాలీగా బయల్దేరి వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారు. మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై కిషన్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.