: గుంటూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

గుంటూరు జిల్లాలోని ఒక కలప డిపో ఈ ఉదయం అగ్నికి ఆహుతైంది. మణిపురం సమీపంలోని కలప డిపోలో అగ్ని ప్రమాదం తలెత్తి మంటలు భారీగా ఎగసిపడ్డాయి. చుట్టూ నివాసాలు ఉండడంతో, వారు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. మంటలు పక్కనున్న ఇళ్లకు విస్తరించకుండా అడ్డుకోగలిగారు. ఈ ప్రమాదంలో డిపోలోని కలప అంతా దాదాపుగా కాలిపోయింది. రూ.20లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

More Telugu News