: చంద్రబాబుతో బొండా ఉమా భేటీ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కృష్ణాజిల్లాకు చెందిన టీడీపీ నేత బొండా ఉమా ఇవాళ ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ... విజయవాడ సెంట్రల్ లో బీజేపీకి బలం లేదని అన్నారు. పొత్తులో భాగంగా విజయవాడను బీజేపీ కోరడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ పార్టీ పంతానికి పోవడం సరికాదని ఉమా సూచించారు.