: తిరుమలలో వేడుకగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీరామనవమిని పురస్కరించుకుని ఇవాళ తిరుమలలోని శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు మలయప్పస్వామి శ్రీరామచంద్రుని రూపంలో హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి పది గంటల తర్వాత ఆలయంలో ప్రత్యేకంగా ఆస్థానం నిర్వహిస్తారు. 9వ తేదీన రాత్రి శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమం జరుగుతుంది.