: భద్రాచలంలో ఘనంగా ప్రారంభమైన శ్రీరామనవమి వేడుకలు
ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవాలయం నుంచి కల్యాణ మండపం వరకు అత్యంత వైభవంగా ఉరేగింపు సాగుతోంది. గోదావరిలో పుణ్యస్నానాల కోసం భక్తులు బారులు తీరారు. కల్యాణమూర్తుల ఊరేగింపు ఈ రోజు ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ఉంటుంది. అనంతరం సీతారాముల కల్యాణం ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు జరుగుతుంది. స్వామివారి కల్యాణానికి తలంబ్రాలు, పట్టువస్త్రాలను రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సమర్పిస్తారు.