: టీడీపీతో పొత్తుకు దారులు తెరిచే ఉన్నాయి: జేపీ
టీడీపీతో పొత్తుకు ఇంకా దారులు తెరిచే ఉన్నాయని లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, టీడీపీతో ముందుకెళ్లాలని తాము ఆశిస్తున్నామని అన్నారు. పొత్తులపై చర్చలు జరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తన కృషి, పట్టుదల అంతా దేశభవిష్యత్ కోసమేనని ఆయన అభిప్రాయపడ్డారు.