: ఇంట్లో నగలు ప్రియుడికి దోచిపెట్టింది
సమాజంలో దిగజారుతున్న విలువలకు ఈ సంఘటన ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. బెంగళూరులోని అగ్రహార దాసరహళ్లికి చెందిన వివాహిత భాగ్యలక్ష్మి... పక్కింట్లో ఉండే ఒక జులాయితో ప్రేమలో పడింది. అంతేకాదు, అతడి అవసరాల కోసం డబ్బులు కూడా ఇస్తుండేది. గతేడాది కాన్పు కోసం ఆమె పుట్టింటికి వెళ్లింది. ఆ సమయంలో తనకు డబ్బులు కావాలని ప్రియుడు మధు వెంటబడగా... ఒక్కో ఆభరణాన్ని దొంగతనంగా అతడికి సమర్పించుకుంది. అలా పుట్టింటికి చెందిన 750 గ్రాముల బంగారు ఆభరణాలను మధుకి ఇవ్వగా అతడు కుదువపెట్టుకుని జల్సాలు చేశాడు. ఇంట్లో ఆభరణాలు మాయమవుతున్నాయని గుర్తించిన భాగ్యలక్ష్మి తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వగా అసలు విషయం వెలుగు చూసింది. దాంతో పోలీసులు భాగ్యలక్ష్మి, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. అయితే, భాగ్యలక్ష్మి తండ్రి హెడ్ కానిస్టేబుల్ కావడం కొసమెరుపు.