: టీడీపీకి రాజీనామా చేస్తున్నా: మైనంపల్లి

మల్కాజ్ గిరి నియోజకవర్గ టీడీపీ నేత మైనంపల్లి హనుమంతరావు పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో కాలం నుంచి సేవ చేస్తున్న తనకు అన్యాయం చేశారని ఆరోపించారు. గతంలో రెండు సార్లు టీడీపీని గెలిపించానని చెప్పారు. వేరే పార్టీలో చేరుతారా? అన్న మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ... తనది పార్టీలు మారే సంస్కృతి కాదని, ఇన్నాళ్లు టీడీపీకి ఎనలేని సేవ చేసిన తాను వేరే పార్టీలోకి వెళ్లనని స్పష్టం చేశారు. మల్కాజ్ గిరి నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని తెలిపారు.

More Telugu News