: టీఆర్ఎస్ అభ్యర్థికి రూ.528 కోట్ల ఆస్తులు

టీఆర్ఎస్ పార్టీ తరపున చేవెళ్ల లోక్ సభ స్థానానికి పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డికి కొండంత ఆస్తులున్నాయి! శనివారం ఆయన ఎన్నికల కమిషన్ కు సమర్పించిన నామినేషన్ పత్రాల్లో తనకు, తన భార్య, కుమారుల పేరిట 528 కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. విశ్వేశ్వరరెడ్డి భార్య అపోలో ఆస్పత్రుల ఎండీ సంగీతారెడ్డి కావడం గమనార్హం. తమ సంపదలో ఎక్కువ భాగం అపోలో ఆస్పత్రుల్లో వాటాల రూపంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. అలాగే, ఆంధ్రా పెట్రో, ది ఆంధ్రా షుగర్స్, సిటాడెల్ రీసెర్చ్ తదితర కంపెనీల్లోనూ వాటాలున్నాయని ఆయన వెల్లడించారు. దీంతో టీఆర్ఎస్ తరపున విశ్వేశ్వరరెడ్డి సంపన్న అభ్యర్థిగా ఉన్నారు.

More Telugu News