: టీడీపీ, బీజేపీల మధ్య 'పొత్తు'చర్చలు ఫలప్రదం
టీవీ సీరియల్లాగ కొనసాగిన టీడీపీ, బీజేపీల మధ్య పొత్తుల చర్చలు ఫలప్రదమయ్యాయి. టీడీపీ నాయకత్వంతో బీజేపీ అగ్రనేత జవదేకర్ జరిపిన చర్చలు ఫలించాయి. సీమాంధ్రలో 5 పార్లమెంట్, 15 అసెంబ్లీ సీట్లను బీజేపీకి ఇవ్వడానికి టీడీపీ అంగీకరించింది. అలాగే తెలంగాణలో 8 పార్లమెంట్, 45 అసెంబ్లీ సీట్లను బీజేపీకి కేటాయించింది. దీంతో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు కలసి పోటీ చేసే అంశంలో సందిగ్ధత తొలగిపోయింది.