: బోరుబావిలో బాలిక...కొనసాగుతున్న సహాయక చర్యలు
తమిళనాడులోని విల్లుపురంలో మూడేళ్ల బాలిక ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. దీంతో బాలికను రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలను ప్రారంభించారు. బాలిక 28-30 అడుగుల లోతులో చిక్కుకుందని గుర్తించిన అధికారులు, ఆమెను రక్షించడానికి బోరుబావికి సమాంతరంగా మరో గొయ్యి తవ్వుతున్నారు.