: వీరిద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా సపోర్ట్ చేస్తా: ఎర్రబెల్లి

మల్కాజ్ గిరి లోక్ సభ స్థానంలో టీడీపీకి అనుకూల ఫలితాలు వస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఆ స్థానం నుంచి ఎంపీగా పోటీచేసేందుకు పలువురు మొగ్గుచూపుతున్నారు. వీరిలో రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో వీరిద్దరితో కలసి ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. రేవంత్, నరేందర్ ఇద్దరూ పార్టీ కోసం ఎంతో కష్టపడి పని చేశారని... మల్కాజ్ గిరి టికెట్ వీరిద్దరిలో ఎవరికిచ్చినా తాను సపోర్ట్ చేస్తానని ఎర్రబెల్లి అధినేతకు తెలిపారు.

More Telugu News