: ప్రియాంక ప్రచారంతో మోడీని ఓడించాలని కలగంటున్న కాంగ్రెస్ నేత

గుజరాత్ లోని వడోదర లోక్ సభ నియోజకవర్గం నుంచి మోడీపై పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ మధుసూదన్ మిస్త్రీ యువరాణి ప్రచారాన్ని ఆశిస్తున్నారు. ప్రియాంకాగాంధీ ప్రచారంతో మోడీపై విజయం సాధించాలని ఆయన ఆశపడుతున్నారు. ప్రియాంకా గాంధీ తన నియోజకవర్గంలో ప్రచారం చేస్తే ఎంతగానో సంతోషిస్తానని తాజాగా మిస్త్రీ అన్నారు. రాహుల్ కు తోడుగా ప్రియాంక కూడా ప్రచార బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ వ్యూహకర్త శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యానించిన నేపథ్యంలో... యువరాణితో ప్రచారం చేయించుకోవాలని మధుసూదన్ మిస్త్రీ ఆశపడుతున్నట్లున్నారు.

More Telugu News