: కోహ్లీ నన్ను పెళ్లాడు: ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ ఆఫర్

ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు, 23 ఏళ్ల డానియెల్ వైట్ భారత క్రికెట్ స్టార్ కోహ్లీకి ఓ ఆఫర్ ఇచ్చింది. తనను పెళ్లి చేసుకోవాలంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భారత్ అజేయమాన ప్రదర్శనతో ఫైనల్లోకి అడుగుపెట్టిన సమయంలోనే డానియెల్ ఈ ఆఫర్ చేయడం విశేషం. 'కోలీ (ఆమెకు కోహ్లీ పేరు సరిగా తెలిసినట్లు లేదు) నన్ను పెళ్లి చేసుకో' అంటూ పోస్ట్ చేసింది. దీనికి స్పందనగా ఓ ఫాలోయర్... కోహ్లీ ఇప్పటికే మరో ఆఫర్ (బాలీవుడ్ నటి అనుష్క) స్వీకరించాడన్నట్లుగా పేర్కొన్నారు. కోహ్లీకి అమ్మాయిల నుంచి వివాహ ప్రతిపాదనలు రావడం కొత్తేమీ కాదు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో పలువురు తమను పెళ్లాడాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించిన సందర్భాలు ఉన్నాయి.

More Telugu News