: హంపీ ఎక్స్ ప్రెస్ లో దొంగల బీభత్సం

రైళ్లలో దోపిడీ దొంగలు చెలరేగిపోతున్నారు. మొన్నటి చెన్నై ఎక్స్ ప్రెస్ దోపిడీ మరువకముందే మరో దుశ్చర్యకు తెగబడ్డారు. అనంతపురం జిల్లా కల్లూరు వద్ద హంపీ ఎక్స్ ప్రెస్ రైల్లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఎస్ 7, ఎస్ 8 బోగీల్లో ఉన్న ప్రయాణికులను కత్తులతో బెదిరించి ఆభరణాలు, నగదు దోచుకునేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు కాల్పులు జరపడంతో దొంగలు పరారయ్యారు. హంపీ నుంచి రైలు బెంగళూరు వెళ్తుండగా కల్లూరు వద్ద ఘటన జరిగింది.

More Telugu News