: టీడీపీ హామీలపై ఈసీకి ‘ఏఏపీ’ ఫిర్యాదు

తెలుగుదేశం పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలను ఇస్తోందంటూ ఎన్నికల సంఘానికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) నాయకులు ఫిర్యాదు చేశారు. టీడీపీ ఇస్తోన్న రుణమాఫీ హామీలు ప్రజలను ప్రలోభపెట్టేవిగా ఉన్నాయని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. హామీలు నెరవేర్చడమెలా? అవి ఆచరణ సాధ్యమేనా? అనే విషయం చెప్పకుండా టీడీపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఏఏపీ నేతలు ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీ తన హామీల ద్వారా రైతులు, డ్వాక్రా మహిళలు రుణాలు చెల్లించవద్దని పిలుపునివ్వడం దారుణమని వారు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకుని టీడీపీ ఇస్తున్న అలవికాని హామీలకు అడ్డుకట్ట వేయాలని ఏఏపీ నేతలు ఈసీకి విజ్ఞప్తి చేశారు.

More Telugu News