: ఓటర్లలో చైతన్యం కోసం 113 కి.మీ. పొడవైన మానవహారం

ఓటర్లను చైతన్యపరిచేందుకు ఏప్రిల్ 7వ తేదీన అతి పెద్ద మానవహారం ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లా అధికారులు తలమునకలై ఉన్నారు. యూపీలోని బిజ్నూర్ జిల్లా సరిహద్దు నుంచి కాంధలా చెక్ పోస్టు వరకు సుమారు 113 కి.మీ. మేర ఈ మానవ హారాన్ని నిర్వహించనున్నారు. స్వచ్చంధ సంస్థల సహకారంతో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ఉద్యోగులు, స్వచ్చంద సంస్థల కార్యకర్తలు ఇందులో పాల్గొంటారని ముజఫర్ నగర్ జిల్లా కలెక్టర్ కోశల్ రాజ్ శర్మ చెప్పారు.

More Telugu News