: టీఆర్ఎస్ తో పొత్తు ఉండకపోవచ్చు: జానారెడ్డి

టీఆర్ఎస్ తో పొత్తు ఉండకపోవచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని చెప్పారు. సీపీఐతో పొత్తును ఒక ఆశయం కోసం పెట్టుకున్నామని... ఆశ కోసం కాదని తెలిపారు. ఈ రోజు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలతో జానా, దానం భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఒక ప్రాంతంలో పార్టీ నష్టపోతుందని తెలిసినా... సోనియాగాంధీ విభజన అనే కఠోర నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఓటర్లందరూ కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. తన కుమారుడు పోటీ చేస్తాడా? లేదా? అనే విషయం హైకమాండ్ చూసుకుంటుందని చెప్పారు.

More Telugu News