: కాంగ్రెస్ నుంచి పోటీ చేయను: కావూరి

కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయనని కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ లో ఉండాలా, వద్దా ? అనే విషయాన్ని ఇంకా నిర్ణయించలేదని అన్నారు. కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు. టీడీపీలో చేరే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని కావూరి చెప్పారు. మంత్రిగా ఉండడం వల్ల ఎవరెవర్నో కలుస్తూ ఉంటామని, తనది ప్రచారం కోసం పాకులాడే మనస్తత్వం కాదని స్పష్టం చేశారు.

More Telugu News