: కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ కు బెయిల్
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ముక్కలు ముక్కలుగా నరికేస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ కు బెయిల్ లభించింది. ఈ మేరకు రూ.50,000 రెండు బాండ్లను సమర్పించాలని, మరోసారి అటువంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ హెచ్చరించి సహరాన్ పూర్ అడిషనల్ డిస్ట్రిక్ జడ్జి బెయిల్ మంజూరు చేశారు. గతనెల చివరివారంలో పోలీసులు మసూద్ ను అరెస్టు చేయగా డియోబంద్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ 12 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే.