: తెలుగుదేశంతోనే బీసీలకు రాజ్యాధికారం: చంద్రబాబు

తెలుగుదేశంతోనే బీసీలకు రాజ్యాధికారం వస్తుందని చంద్రబాబు అన్నారు. వరంగల్ జిల్లా హన్మకొండలో జరిగిన తెలుగుదేశం ప్రజాగర్జన సభలో ఆయన ప్రసంగిస్తూ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాకే బీసీలు ఎంపీలయ్యారని, అన్ని వర్గాల ప్రజలకు టీడీపీ అండగా ఉంటుందని అన్నారు. ఆర్ధికంగా, రాజకీయంగా తెలంగాణ వాసులను పైకి తీసుకొస్తామని తెలిపారు. టీఆర్ఎస్ ఉప ఎన్నికల పార్టీ అని, ఆ పార్టీ అధినేత పూటకో మాట మాట్లాడుతుంటారని, ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానన్న ఆయన, ఇప్పుడు దాన్ని గురించి మాట్లాడటం లేదని విమర్శించారు. టీఆర్ఎస్ వసూళ్ళ పార్టీగా మారిపోయిందని ఆరోపించారు. గడీ పాలన కావాలో లేక సుపరిపాలన కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. తెలంగాణలో తెలుగుదేశాన్ని ఎవరూ ఏమి చేయలేరన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ ఒక్క పనైనా చేసిందా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం కృషితోనే హైదరాబాదుకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందన్నారు. వరంగల్ జిల్లా మహిళలు రుద్రమదేవి లాగా పోరాడాలన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలోనూ తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News