: అనకాపల్లి నుంచే బరిలో దిగుతా: గంటా
అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచే ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తున్నానని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ, తనను విశాఖ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయమన్నా అభ్యంతరం లేదని అన్నారు. విశాఖపట్టణం కీలకమైన స్థానమైనందునే తమ పార్టీ బీజేపీకి కేటాయించేందుకు సిద్ధంగా లేదని ఆయన స్పష్టం చేశారు.