: నాస్తికులకు హెచ్చరిక

దేవుడు లేడు, మనిషే అన్నిటికీ మూలం అనే నాస్తికులకు హెచ్చరిక. సౌదీ ప్రభుత్వం నాస్తికులపై నిప్పులు చెరుగుతోంది. తాజాగా సౌదీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు నాస్తికులంతా టెర్రరిస్టులే. నాస్తికవాదం పచ్చి ఉగ్రవాదం కనుక నాస్తికులంతా టెర్రరిస్టులే అని అంటోంది. ఉగ్రవాదులకు ఏ శిక్ష విధిస్తారో అదే శిక్ష నాస్తికులకు కూడా పడుతుంది. అలా శిక్ష పడేవారు 20 ఏళ్లు కటకటాలు లెక్కించాల్సిందే. దీనితో పాటు ఇస్లాం మౌలిక విశ్వాసాలను విశ్వసించనివారెవరైనా ఉగ్రవాదులేనని ఆ ఆదేశాలు స్పష్టం చేశాయి. ఈజిప్టులోని మత సంస్థ ముస్లిం బ్రదర్ హుడ్ ను ఉగ్రవాద సంస్థగా పేర్కొంది.

More Telugu News