: నిజామాబాద్ నుంచి పోటీ చేస్తున్నా: కవిత
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజకీయ ఆరంగేట్రం ఖరారయింది. రానున్న ఎన్నికల్లో తాను నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని టీఆర్ఎస్ శ్రేణులకు ఆమె స్పష్టం చేసినట్టు తెలిసింది. ప్రత్యక్ష రాజకీయాల్లో పాలుపంచుకోవాలనే తపనను ఆమె ఎన్నాళ్లనుంచో వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే.