: కాంగ్రెస్ ను సోనియా నాశనం చేసింది: పిన్నమనేని

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై టీడీపీ నేత పిన్నమనేని వెంకటేశ్వరరావు విమర్శనాస్త్రాలు సంధించారు. సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని చీల్చాలనే ఘోరమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా తీసుకున్నారని మండిపడ్డారు. 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని సోనియాగాంధీ నాశనం చేశారని ఆరోపించారు. చంద్రబాబు విజన్ తో సీమాంధ్ర అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు. కేవలం బాబుపై నమ్మకంతోనే టీడీపీలో చేరానని స్పష్టం చేశారు.

More Telugu News