: టీఆర్ఎస్ బోల్తా పడింది: చంద్రబాబు
తప్పులు చేసేవారికి పతనం తప్పదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 125 ఏళ్ల చరిత్ర ఉన్నప్పటికీ, తప్పుడు పనులు చేసిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం కూడా లేదని అన్నారు. తెలంగాణ ప్రాంతంలోనూ టీడీపీకి తిరుగులేదని తెలిపారు. ఏదేదో చేద్దామనుకున్న టీఆర్ఎస్ చివరకు బోల్తాపడిందని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని అన్నారు. అభివృద్ధి జరగాలంటే ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని తెలిపారు.