: కడప రైల్వేస్టేషన్ లో రైళ్ల రాకపోకలు యథాతథం
కృష్ణపట్నం నుంచి ఆర్టీపీపీకి వెళ్తున్న గూడ్స్ రైలు కడప రైల్వేస్టేషన్ లో మంగళవారం సాయంత్రం పట్టాలు తప్పిన విషయం విదితమే. రైల్వే సిబ్బంది పట్టాలు తప్పిన గూడ్స్ రైలును మంగళవారం రాత్రి 11.30 గంటల నుంచి ఇవాళ ఉదయం వరకు శ్రమించి మరో ట్రాక్ పైకి ఎక్కించారు. దీంతో నిన్న సాయంత్రం 5 గంటలకు చెన్నై నుంచి రావాల్సిన దాదర్ ఎక్స్ ప్రెస్ ను నందలూరులో గంటన్నర పాటు నిలిపివేశారు. మిగిలిన రైళ్లను ఒకటో నెంబరు ప్లాట్ ఫాం మీదుగా మళ్లించడంతో రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఏర్పడలేదు. దీంతో ఇవాళ ఉదయం 6 గంటల నుంచి రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయని ఏడీఆర్ఎం సత్యనారాయణ తెలిపారు.